`భ‌ర‌త్‌..` మేనియా మొద‌లు

హైద‌రాబాద్‌/అమ‌రావ‌తి: ఇంకొన్ని గంట‌లు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2000కు పైగా స్క్రీన్ల‌పై సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సంద‌డి చేయ‌బోతున్నాడు. `భ‌ర‌త్ అనే నేను..` ప్రేక్ష‌కుల ముందుక రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో గురువారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత నుంచే షోలు ప‌డ‌బోతున్నాయి.

వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేట‌ర్ల‌లో తెల్ల‌వారు జామున 5 గంట‌ల‌కే షోను వేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే అనుమ‌తి ఇచ్చింది. `భ‌ర‌త్‌..` మూవీ విడుద‌ల‌య్యే ప్ర‌తి థియేట‌ర్ వ‌ద్దా అభిమానుల సంద‌డి మొద‌లైపోయింది. మ‌హేష్‌బాబు నిలువెత్తు క‌టౌట్లను క‌డుతున్నారు. బ్యాన‌ర్లు త‌గిలిస్తున్నారు.

అభిమానుల బ్యాన‌ర్లు, పోస్ట‌ర్ల‌తో ఆయా థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. సినిమా హాళ్ల వ‌ద్ద‌ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్యా 35 ఎంఎం ప్ర‌ధాన థియేట‌ర్ కాగా.. జంట‌న‌గ‌రాల్లో 80కి పైగా సినిమా హాళ్ల‌లో ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.

 

ఒక్క అమెరికాలోనే 320 స్క్రీన్ల‌పై సినిమాను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. మ‌హేష్‌బాబు-కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీ‌మంతుడు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను నెల‌కొల్పింది.

శ్రీ‌మంతుడుతో పాటు ఇప్ప‌టిదాకా ఉన్న అన్ని క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను తుడిచి పెట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, నాన్ బాహుబ‌లి రికార్డుల్లో ఇదే మొద‌టిది అవుతుంద‌నీ సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. సెన్సార్ బోర్డు నుంచి పాజిటివ్ టాక్ రావ‌డం.. అభిమానుల్లో రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here