ఇంట‌ర్వ్యూ కోసం వెళ్లిన ఓ మ‌హిళ‌..మిస్సింగ్‌!

ఇంటర్య్వూకు హైద‌రాబాద్‌కు వెళ్లిన ఓ మహిళ అదృశ్యం అయ్యారు. ఆమె మొబైల్‌ఫోన్ స్విచాఫ్ వ‌స్తోంది. ఆమె పేరు శ్రావ‌ణి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం రామ‌చంద్రాపుం ఆమె స్వ‌స్థ‌లం. భ‌ర్త న‌రేష్ వ‌ర్మ‌తో క‌లిసి ఆమె రామ‌చంద్రాపురంలో నివ‌సిస్తున్నారు. ఓ ఇంట‌ర్వ్యూకు హాజరు కావ‌డం కోసం శ్రావ‌ణి ఒంట‌రిగా హైద‌రాబాద్‌కు వెళ్లారు.

ఉప్ప‌ల్‌లో ఉండే త‌న స్నేహితురాలి ఇంట్లో దిగారు. ఇంట‌ర్వ్యూ ముగిసిన మ‌రుస‌టి రోజు ఆమె భీమ‌వ‌రానికి తిరుగు ప్ర‌యాణం అయ్యారు. భీమవరం వెళ్ల‌డానికి శ్రావణి, ఆమె స్నేహితురాలు ఉప్పల్‌ రింగురోడ్డు వ‌ద్ద‌కు వ‌చ్చారు. బస్సు ఎక్క‌డానికి ముందే స్నేహితురాలు ఇంటికెళ్లారు. ఆ త‌రువాత శ్రావ‌ణి జాడ తెలియ‌రాలేదు.

ఉప్ప‌ల్ రింగ్‌రోడ్డు వ‌ద్ద నుంచి ఆమె ఎటు వెళ్లార‌నేది మిస్ట‌రీగా మారింది. ఆమె భీమ‌వ‌రానికి వెళ్లలేదు. అస‌లు భీమ‌వ‌రం వెళ్లే బ‌స్సు కూడా ఎక్క‌లేద‌ని తెలుస్తోంది. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఉంది. ఆచూకీ లభించకపోవడంతో శ్రావణి సోదరుడు సత్యనారాయణరాజు మంగళవారం ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు. సెల్‌ఫోన్ ట‌వ‌ర్ లొకేష‌న్ ఆధారంగా ఆమె కోసం గాలిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here