మ‌న బాహుబ‌లి..అక్క‌డ మ‌హాబ‌లి: రీమేక్ రెడీ అవుతోంది..బ‌డ్జెట్ కూడా అదే రేంజ్ అట‌!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీసుల‌ను కొల్ల‌గొట్టిన బాహుబ‌లికి రీమేక్ రెడీ అవుతోంది. భోజ్‌పురి భాష‌లో ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరో భోజ్‌పురి న‌టుడు దినేష్‌లాల్ యాద‌వ్ నిర‌హువా ఇందులో హీరో.

మూవీ పేరు వీర్‌ యోధ మహాబలి. అమ్రపాలి దూబే క‌థానాయికగా అంటే దేవ‌సేన పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమ‌వారం విడుద‌లైంది. ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు తరణ్‌ ఆదర్శ్ సోష‌ల్ మీడియాలో ఈ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

భోజ్‌పురితో పాటు హిందీ, తెలుగు, తమిళం, బెంగాళీ భాషల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. భోజ్‌పురి ద‌ర్శ‌కుడు ఇక్బాల్‌ బక్ష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రమేశ్‌ వ్యాస్‌ నిర్మాత.

ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా సుమారు 150 కోట్ల రూపాయ‌లు ఉండొచ్చ‌ని చెబుతున్నారు.ఈ సినిమా బ‌డ్జెట్ కూడా సుమారు 150 కోట్ల రూపాయ‌లు ఉండొచ్చ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here