రాజ‌న్న బ‌యోపిక్‌లో ష‌ర్మిళ క్యారెక్ట‌ర్‌లో ఒక‌ప్ప‌టి టాప్ హీరోయిన్

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం `యాత్ర‌`. వైఎస్‌గా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఒక‌టి ఇదివ‌ర‌కే విడుద‌లైంది. `ఆనందో బ్ర‌హ్మ` ద‌ర్శ‌కుడు మ‌హీ వి రాఘ‌వ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా- ఈ సినిమాలో కీల‌క‌మైన ష‌ర్మిళ పాత్ర కోసం భూమిక‌ను తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని చిత్రం యూనిట్ ఇంకా అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. వైఎస్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి సూరీడు పాత్ర‌లో పోసాని కృష్ణమురళి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి నటిస్తున్నారు. బాహుబ‌లి-2లో ఆశ్రిత `క‌న్నా నిదురించ‌రా` పాట‌లో అనూష్క‌తో క‌లిసి క‌నిపించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here