ఈసారి బిగ్ బాస్ ఏకంగా 100రోజులట.. బోర్ కొడితే తేడాలు వచ్చేస్తాయ్ నాని..!

ఒకప్పుడు ప్రో కబడ్డీ లీగ్ ను ఇండియాలో మొదలుపెట్టారు.. క్రికెట్ తర్వాత దీనికి అమితమైన ఆదరణ లభించింది. రెండు సీజన్లు తక్కువ జట్లతో కొద్ది రోజుల పాటూ మాత్రమే నిర్వహించారు. అది హిట్ అయింది..! అయితే గత ఏడాది సుదీర్ఘమైన సీజన్ నిర్వహించారు. దీంతో టీఆర్పీలు పడిపోవడమే కాకుండా మ్యాచ్ లు చూసే వాళ్ళు కూడా కరువయ్యారు. అదే తప్పే జరగబోతోందా..? ఎందుకంటే మొదటి బిగ్ బాస్ సీజన్ హిట్ అయిందన్న ఆనందంలో రెండో సీజన్ ను మొదలుపెట్టబోతోంది స్టార్ మా ఛానెల్. అయితే ఏకంగా 100 రోజుల పాటూ కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఒకవేళ అంత ఆసక్తికరంగా లేకపోతే మరీ అన్ని రోజులు సాగదీస్తే కష్టమే..!

‘జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2’ అంటూ నాని ట్వీట్ చేశాడు. జూన్ 10 నుంచి తాను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నానని నాని చెప్పాడు. ‘ఏదైనా జరగొచ్చు’ రెడీగా ఉండండంటూ నాని మరింత ఆసక్తి పెంచుతున్నాడు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here