విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌.. ఫ్రెండ్స్ వాట్స‌ప్ గ్రూపుల్లో వీడియోను షేర్ చేసిన నిందితులు

పాట్నా: బిహార్‌లో మ‌రోసారి పైశాచిక ఘ‌ట‌న చోటు చేసుకుంది. మొన్న‌టికి మొన్న జెహ‌నాబాద్‌లో ఓ మైన‌ర్ బాలిక‌పై ఏడుమంది యువ‌కులు లైంగిక దాడికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న తాలూకు ప్ర‌కంప‌న‌లు త‌గ్గ‌క‌ముందే- మ‌రో సామూహిక అత్యాచార ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఓ విద్యార్థినిపై ముగ్గురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

ఈ వీడియోను వారు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌మ స్నేహితుల‌కు సంబంధించిన వాట్స‌ప్ గ్రూపుల్లో షేర్ చేశారు. బిహార్‌లో ఈ క్రూర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వీడియోలో క‌నిపించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఘ‌ట‌న చోటు చేసుకుని సుమారు రెండు రోజులవుతున్న‌ప్ప‌టికీ.. పోలీసులు నిందితులు ఎవ‌ర‌నే విష‌యాన్ని క‌నీసం గుర్తించ‌లేక‌పోతున్నారు. ఈ వీడియోలో క‌నిపించిన యువ‌కుల భాష‌, యాస‌ను బ‌ట్టి వారు బిహార్‌లోని మ‌గ‌ధ రీజియ‌న్‌కు చెందిన వారై ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

ఈ రీజియ‌న్ ప‌రిధిలోకి వ‌చ్చే జెహ‌నాబాద్‌, గ‌య‌, ఔరంగాబాద్‌, అఖ‌ల్ ప్రాంతాల‌కు చెందిన వారై ఉండొచ్చ‌ని గ‌య ఏసీపీ రాజీవ్ మిశ్ర తెలిపారు. ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేస్తుండ‌గా.. మ‌రొక‌రు దాన్ని వీడియో తీశారు. గ‌యలో ఈ వీడియో వెలుగులోకి రావ‌డంతో అక్క‌డి పోలీసులు దీనిపై కేసు న‌మోదు చేశారు.

మ‌రో యువ‌కుడు ఆమెను ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఇందులో క‌నిపిస్తోంది. ఆ యువ‌కుడు ఆమె ప్రియుడై ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు యువ‌కులు మొద‌ట అత‌ణ్ని కొట్ట‌డం, ఆ త‌రువాత యువ‌తిపై గ్యాంగ్‌రేప్‌న‌కు పాల్ప‌డ్డార‌ని, వారి కోసం గాలిస్తున్నామ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here