అమ్మాయిని స్తంభానికి క‌ట్టేసి కొడుతుంటే చూస్తూ నిల్చున్నారే త‌ప్ప‌..!

పాట్నా: మొన్న‌టికి మొన్న ప‌ట్ట‌ప‌గ‌లు ఓ బాలికపై న‌డి రోడ్డు మీదే లైంగిక దాడి చేసిన విస్మ‌రించ‌క‌ముందే- అదే బీహార్‌లో మ‌రో ఆట‌విక ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అమ్మాయిని స్తంభానికి క‌ట్టేసి కొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంటి వ‌రండాలో ఆ యువ‌తిని స్తంభానికి క‌ట్టేసి ఓ యువ‌కుడు ఇష్టానుసారంగా కొట్టాడు.

ఆ స‌మ‌యంలో మ‌హిళ‌లు, పిల్ల‌లు గుంపుగా నిల్చుని చూస్తూ నిల్చున్నారు. ధైర్యం చేసిన ఓ మ‌హిళ ఆ యువ‌కుడిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన దృశ్యాలు వీడియోలో రికార్డ‌య్యాయి. బీహార్‌లోని ప‌శ్చిమ్ చంపార‌న్ జిల్లా బ‌గాహాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ప‌శ్చిమ్ చంపార‌న్ జిల్లా ఎస్పీ దృష్టిలో ప‌డింది. దీన్ని చూసిన వెంట‌నే ఆయ‌న విచార‌ణ‌కు ఆదేశించారు. నిందితుల‌ను అరెస్టు చేయాని నౌరంగియా పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. శ‌ర‌వేగంగా స్పందించిన పోలీసులు.. ఈ ఘ‌ట‌నలో ప్రమేయం ఉన్న సుర్‌సేన్ కుమార్‌, హ‌న్స్‌రాజ్ కుమార్‌, క‌న్వ‌ల్ కుమార్‌, మేఘ్‌నాథ్ బ‌ర్ఘారియా అనే యువ‌కుల‌ను అరెస్టు చేశారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఆమెను అలా క‌ట్టేసి, కొట్టాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నేది ఇంకా తెలియ‌రావ‌ట్లేదు. దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here