మ‌రో అమ్మాయిని అల్ల‌రి పెట్టారు..ఇంట‌ర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశారు!

త‌న స్నేహితుడితో క‌లిసి ప్ర‌యాణించ‌డ‌మే ఆమె చేసిన పాప‌మైంది. ఎవ‌రితో వెళ్తున్నావ్‌? ఏం చేస్తున్నావ్‌? ఎక్క‌డికెళ్తున్నావ్? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన కొంద‌రు యువ‌కులు.. ఆ యువ‌తి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఆమె దుస్తులు విప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది కూడా బిహార్‌లోనే.

కొద్దిరోజుల కింద‌ట జెహ‌నాబాద్‌లో ఓ మైన‌ర్ బాలికను ఏడుగురు యువ‌కులు చుట్టుముట్టి దుస్తులు విప్పిన ఘ‌ట‌నను ఇంకా విస్మ‌రించ‌క‌ముందే- దాని పొరుగునే ఉన్న మ‌రో జిల్లాలో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఇద్ద‌ర్ని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం అన్వేషిస్తున్నారు. వ‌జీర్‌గంజ్ శివార్ల‌లో ఓ యువ‌తి, యువ‌కుడిని అడ్డుకున్న న‌లుగురు యువ‌కులు వారి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు.

కింద‌ప‌డేసి, కాళ్ల‌తో తొక్కారు. ఆ యువ‌తిని చుట్టుముట్టి లైంగికంగా వేధించారు. ఆమె దుస్తులు విప్పే ప్ర‌య‌త్నం చేశారు. దీన్ని వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే వ‌జీర్‌గంజ్ పోలీసులు సుధీర్ యాద‌వ్‌, విజ‌య్ యాద‌వ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here