ఆ స‌మ‌యంలో వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి!

అది జాతీయ పార్కు కాదు..వాళ్లు చేస్తున్న‌ది స‌ఫారి అంత‌కంటే కాదు. రోజూలాగే అట‌వీ ప్రాంతం నుంచి బైక్‌వై వెళ్తుండ‌గా.. రెండు పెద్ద పులులు అనూహ్యంగా వారికి ఎదురొచ్చాయి. స్వాగ‌తం ప‌లికాయి.

ఏ మాత్రం ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌తో ఏం చేయాలో వారికి తోచ‌లేదు. బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి క‌ద‌ల‌కుండా దాని మీదే కూర్చుండిపోయారు. ఏం చేయాలో తోచ‌క‌పోవ‌డ‌మే వారి ప్రాణాల‌ను కాపాడింద‌నే అనుకోవ‌చ్చు.

పెద్ద పులులు ఎదురైన స్థితిలో గుండెలు అదిరేలా అరిచి ఉన్నా, దిగి పారిపోయే ప్ర‌యత్నం చేసి ఉన్నా.. పులుల‌కు ఆహారం అయిపోయేవారే. మ‌హారాష్ట్రలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

ఆ బైక‌ర్ల ఎదురుగా కారులో ఉన్న ఓ వ్య‌క్తి ఈ త‌తంగాన్నంత‌టినీ త‌న మొబైల్‌ఫోన్‌లో చిత్రీక‌రించాడు. సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇది షేర్ చేసి.. కొన్నిరోజులైన‌ప్ప‌టికీ.. ఇంకా చూస్తూనే ఉన్నారు జ‌నం ఊపిరిబిగ‌బ‌ట్టుకుని. మొద‌టి ఓ పులి బైక్ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టి.. ప‌క్క‌నున్న పొద‌ల్లోకి వెళ్లింది.

హ‌మ్మ‌య్య అనుకునేలోగా మ‌రో పెద్ద‌పులి బైక్ వ‌ద్ద‌కు నింపాదిగా అడుగులు వేసుకుంటూ వ‌చ్చింది. దాడి చేద్దామ‌ని అనుకునేలోగా.. కారులో ఉన్న వ్య‌క్తులు దాన్ని ప‌సిగ‌ట్టారు. కారును ముందుకు తీసుకెళ్లారు. దీనితో పులులు బెదిరి..అడ‌విలోకి వెళ్లాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here