దీన్ని చూసిన త‌రువాత హెల్మెట్ లేకుండా బండి బ‌య‌టికి తీయాలంటే భ‌య‌ప‌డ‌తారు!

బైక్‌పై వేగంగా వ‌స్తూ, వీధి కుక్క‌ను త‌ప్పించ‌బోయి.. బైక్ మీది నుంచి కింద‌ప‌డి ఓ యువ‌కుడు దుర్మ‌ర‌ణం పాలైన విషాద‌క‌ర ఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లోని న‌ర్సంపేట్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. రోడ్డు మ‌ధ్య‌లో డివైడ‌ర్‌పై అప్ప‌టిదాకా గ‌మ్మున కూర్చున్న ఓ వీధి కుక్క రోడ్డు దాట‌డానికి ప్ర‌య‌త్నించింది.

అదే స‌మ‌యంలో వేగంగా బైక్‌పై వ‌చ్చిన ఓ యువ‌కుడు ఆ కుక్క‌ను చూసి, త‌డ‌బ‌డ్డాడు. కుక్క‌ను ఢీ కొట్టాడు. ఆ వెంట‌నే బ్యాలెన్స్ త‌ప్పాడు. అదే వేగంతో కింద ప‌డ్డాడు. అత‌ని త‌ల నేరుగా, బ‌లంగా డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. దీనితో ఆ యువ‌కుడు క్ష‌ణాల్లోనే ప్రాణాల‌ను కోల్పోయాడు. సంఘ‌టనాస్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు.

ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డ అమ‌ర్చిన సీసీటీవీల్లో రికార్డ‌య్యింది. ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో యువ‌కుడు హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ ఉండి ఉంటే.. అత‌ని త‌ల డివైడ‌ర్‌ను తాకిన‌ప్ప‌టికీ, ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డేవాడు. ఈ వీడియోను రాచ‌కొండ పోలీసులు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. హెల్మెట్ అవ‌స‌రాన్ని చాటి చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here