75 మంది రౌడీల పట్టివేత వెనుక బయటపడ్డ మరో కోణం.. 5 మంది రౌడీలను చంపడానికే ఆ పార్టీ..!

తమిళనాడు పోలీసులు రెండు రోజుల క్రితం 75మంది రౌడీలను అరెస్ట్ చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రౌడీల లీడర్ అయిన బిను పాప్పచ్చన్ చెన్నై లోని మొత్తం రౌడీలను తన బర్త్ డే పార్టీకి రమ్మనడానికి ముఖ్య కారణం.. అతడు ఓ అయిదుగురు రౌడీలను చంపడానికేనట..! సమయానికి పోలీసులు రావడంతో ఆ అయిదుగురూ బ్రతికిపోయారు. ఇక బిను పాప్పచ్చన్ ను కనిపిస్తే కాల్చివేతకు తమిళనాడు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అతడు బైక్ మీద కేరళ పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

దాదాపు 150 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక పట్టుబడిన వాళ్ళ దగ్గర నుండి జర్నలిస్టులుగా గుర్తింపు కార్డులు, న్యాయవాదులుగా పని చేస్తున్నట్టు తప్పుడు ఐడీలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవన్నీ నకిలీవని తేల్చారు. పోలీసులకు దొరికిన వారిలో 20 మంది వరకూ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారంటే తమిళనాడులో రౌడీయిజం ఎలా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసులోనే రౌడీలుగా మారుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. పరారైన వారిలో ఓ ప్రముఖ హీరోయిన్ సోదరుడు కూడా ఉన్నట్టు పట్టుబడ్డ వారు చెప్పారు. తన పుట్టిన రోజు కోసం ఓ బిల్డర్ ను బెదిరించి రూ. 54 లక్షలు వసూలు చేశాడట. ఏది ఏమైనా ఇప్పుడు బిను ను ఎలాగైనా పట్టుకోవాలని.. లేదా కనిపిస్తే కాల్చివేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో అతడి ఎన్ కౌంటర్ జరిగినా జరగచ్చు అని తమిళనాట మాట్లాడుకుంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here