‘అతను ఓ క్రికెటర్ మాత్రమే కాదు.. నా ప్రపంచం’ అని సెహ్వాగ్ ఎవరిని అన్నారంటే..!

ఇంకెవరికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని.. ఈరోజు సచిన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో సెహ్వాగ్ కూడా ఉన్నాడు. సచిన్ తో కలిసి తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘అతను కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. నా ప్రపంచం’ అంతేకాదు.. నాలాంటి ఎంతో మందికి కూడా అతడే ఆదర్శం.. అని చెప్పాడు. భారతదేశంలో సమయాన్ని ఆపగల ఒకే ఒక్క వ్యక్తి అయిన సచిన్ టెండూల్కర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాడు సెహ్వాగ్. అంతేకాకుండా క్రికెట్ బ్యాట్ అనేది ఒక ఆయుధం అని తెలియజేసి.. తన లాంటి వాళ్ళు కూడా వాడడానికి కారణమయ్యావు అని సెహ్వాగ్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం #HappyBirthdaySachin అనేది ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ ఉంది. పలువురు ప్రముఖులు సచిన్ టెండూల్కర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here