వైఎస్ఆర్‌సీపీ నంద్యాల లోక్‌స‌భ ఇన్‌ఛార్జి ఆయ‌నే!

అమ‌రావ‌తి: ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాల అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానాలు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో ఈ రెండు స్థానాల‌నూ ప్ర‌తిప‌క్ష పార్టీ గెలిచింది. ఆ త‌రువాత ఆ రెండూ సీట్లూ ఆ పార్టీవి కాకుండా పోయాయి. నంద్యాల లోక్‌స‌భ స‌భ్యుడు ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించారు.

నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్య‌ర్థిగా గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం.. ఆ సీటుకు ఉప ఎన్నిక రావ‌డం, దాన్ని అధికార తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవ‌డం జరిగిపోయాయి. ఇప్పుడు ఆ రెండు సీట్లూ వైఎస్ఆర్‌సీపీ చేతిలో లేకుండా పోయాయి.

దీనితో బ‌ల‌మైన నాయ‌కుడి కోసం అన్వేషిస్తోన్న త‌రుణంలోనే.. కాట‌సాని రామ్‌భూపాల్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరారు. నిజానికి ఆయ‌న కాంగ్రెస్ నాయ‌కుడు. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల‌పై గ‌ట్టి ప‌ట్టు ఉంది. పాణ్యం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా విజ‌యం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

ప్ర‌స్తుతం పాణ్యం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. పాణ్యానికే చెందిన మ‌రో కీల‌క నేత కాట‌సాని పార్టీలో చేర‌డంతో గౌరు చ‌రిత‌కు టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనే అనుమానాలు ఉండేవి. ఆ అనుమానాలు ప‌టాపంచ‌లు అయ్యాయి.

కాట‌సానిని నంద్యాల లోక్‌స‌భ ఇన్‌ఛార్జిగా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. నంద్యాల లోక్‌స‌భ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ సీట్ల‌పైనా కాట‌సానికి ప‌ట్టు ఉంది. ఎలాగూ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించారు. ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా కాట‌సానిని బ‌రిలో దించుతార‌ని అంటున్నారు వైఎస్ఆర్ సీపీ నాయ‌కులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here