ఎక్కువ ఓట్లు పడింది కాంగ్రెస్ కు.. ఎక్కువ సీట్లు వచ్చింది బీజేపీకి..!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు గంట గంటకూ ఉత్కంఠ రేపుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ కు 78, బీజేపీ 104, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాల్లో ఆధిక్యం లో ఉన్నారు.

బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత వచ్చినప్పటికీ… కాంగ్రెస్ తో పోల్చితే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం తక్కువే. కాంగ్రెస్ కు 38.1 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి కేవలం 36.7 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీని మాత్రమే సాధించడం దీనికి కారణం. ఇక బీజేపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జేడీఎస్ కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా జేడీఎస్‌ అధినేత దేవెగౌడకు ఫోన్‌ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌కి మద్దతిచ్చే అంశంపై తాను కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని దేవేగౌడ తెలిపినట్లు తెలిసింది. అంతేకాదు, దేవెగౌడ నివాసానికి పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఇప్పటికే బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here