స‌మ్మ‌ర్ ఎఫెక్ట్‌: న‌డిరోడ్డుపై మంట‌ల్లో కారు..ఏమీ మిగ‌ల్లేదు!

యాద‌గిరి: స‌మ్మ‌ర్ ఎఫెక్ట్ మొద‌లైంది. ఎండ వేడి తీవ్ర‌త‌కు ఉన్న‌ట్టుండి ఓ కారుకు మంట‌లు అంటుకున్నాయి. జాతీయ ర‌హ‌దారి మీద, అంద‌రూ చూస్తుండ‌గానే నిమిషాల్లో బుగ్గిపాల‌యింది. ఆ కారు బీజేపీకి చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడిది.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని యాద‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ నాయ‌కుడి పేరు డాక్ట‌ర్ శ‌ర‌ణ భూపాల్ రెడ్డి. వ‌చ్చే నెల జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. యాద‌గిరి నుంచి బెంగ‌ళూరుకు కారులో వెళ్తుండ‌గా.. షాహాపుర శివార్లలో కారులో నుంచి ఒక్క‌సారిగా పొగ‌లు వెలువ‌డ్డాయి.

అప్ర‌మ‌త్త‌మైన భూపాల్ రెడ్డి, కారు డ్రైవ‌ర్ వెంట‌నే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మంట‌లు అంటుకున్న కారు క్ష‌ణాల్లో బొగ్గ‌యింది. కారు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్ప‌డ‌టం, ఇంజిన్ వేడెక్క‌డం, ఎండ తీవ్ర‌త వంటి కార‌ణాల వ‌ల్ల మంట‌లు అంటుకున్న‌ట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here