ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల‌తో కివీస్ బౌల‌ర్ల చెడుగుడు: గ‌ంట‌న్న‌ర‌లోపే ముగిసిన తొలి ఇన్నింగ్!

అక్లాండ్‌: క్రికెట్‌లో మ‌రో రికార్డు బ‌ద్ద‌లైంది. 130 సంవ‌త్స‌రాల కింద‌టి రికార్డు ఇది. టెస్ట్ క్రికెట్‌లోనే రెండుగంట‌ల్లోనే తొలి ఇన్నింగ్ ముగియ‌డం 130 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌లో ఇది రెండోసారి. ఫ‌స్ట్ ఇన్నింగ్ మొద‌లు పెట్టిన గంట‌న్న‌రలోపే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లంద‌రూ పెవిలియ‌న్ చేరారు. 58 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యారు. న్యూజీలాండ్ బౌల‌ర్లు నిప్పులు చెరిగారు.

ట్రెంట్ బౌల్ట్ ఆరు, టిమ్ సౌథీ నాలుగు వికెట్ల‌ను ప‌డ‌గొట్టారు. ఆ త‌రువాత ఫ‌స్ట్ ఇన్నింగ్ మొద‌లు పెట్టిన కివీస్.. దూకుడుగా ఆడుతోంది. కేప్టెన్ విలియ‌మ్స‌న్ సెంచ‌రీకి చేరువ‌లో ఉన్నారు. న్యూజీలాండ్‌, ఇంగ్లండ్ జట్ల మ‌ధ్య డే నైట్ టెస్ట్ మ్యాచ్ గురువారం ఆరంభ‌మైంది. నాలుగో ఓవ‌ర్‌లో తొలి వికెట్‌ను పోగొట్టుకున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు.

తొమ్మిదో వికెట్ 31 పరుగుల భాగ‌స్వామ్యం గ‌న‌క న‌మోదు కాక‌పోయుంటే .. ఆ జ‌ట్టు 30 ప‌రుగుల్లోపే చాప చుట్టేసి ఉండేది. టెయిలెండ‌ర్ ఓవ‌ర్ట‌న్ చేసిన 33 ప‌రుగుల‌తో ఇంగ్లండ్ జ‌ట్టు ఆ కాసిన్ని ప‌రుగులైనా చేయ‌గ‌లిగింది. 27 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. 58 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిందా జ‌ట్టు.

 

కుక్‌-5, స్టోన్‌మెన్‌-11, జో రూట్‌-0, మ‌ల‌న్‌-2, బెన్ స్టోక్స్‌-0, బెయిర్‌స్టో-0, మొయిన్ అలీ-0, క్రిస్ వోక్స్‌-5, స్టువ‌ర్ట్ బ్రాడ్‌-0, అండ‌ర్స‌న్‌-1 ప‌రుగులు చేసి అవుట‌య్యారు. 33 ప‌రుగుల‌తో ఓవ‌ర్ట‌న్ నాటౌట్‌గా నిలిచాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్ మొద‌లు పెట్టిన కివీస్‌.. ఓపెన‌ర్లు రావ‌ల్‌-3, లాథ‌మ్‌-26ల‌తో పాటు రాస్ టేల‌ర్‌-20 వికెట్ల‌ను కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. కేప్టెన్ విలియ‌మ్స‌న్‌-88, నికోల్స్ 13 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here