దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీకే మీ ఓటు వేయండి.. అని బీజేపీ సభలో అన్న అమిత్ షా అనువాదకుడు..!

కర్ణాటక ఎన్నికలు మే నెలఓ జరగబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహరీగా తలపడనున్నాయి. అయితే బీజేపీ ప్రచారం మాత్రం అనుకున్నంతగా జరగడం లేదు. మొన్నటికి మొన్న బీజేపీ సీఎం అభ్యర్థి విషయంలో అమిత్ షా నోరు జారిన సంగతి తెలిసిందే. యడ్యూరప్పను అవినీతిపరుడని చెప్పి నాలుక కరచుకున్నాడు. ఇప్పుడు అమిత్ షా అనువాదకుడు పెద్ద తప్పే చేసి ఇరుకున పెట్టేశాడు. అమిత్ షా హిందీలో మాట్లాడి బీజేపీని పొగడగా.. ఆయన అనువాదకుడు మాత్రం కన్నడలో తిట్టేశాడు. స్థానికులకు అర్థం కావాలని ట్రాన్స్ లేటర్లను పెట్టుకోవడం సాధారణం.. కానీ అమిత్ షా పెట్టుకున్న ట్రాన్స్ లేటర్ పెద్ద తప్పే చేసి.. బీజేపీని ఇరుకున పెట్టేశాడు.

అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘సిద్ధ రామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మోదీపై మీకున్న అభిమానాన్ని యాడ్యురప్పకు ఓటేయడం ద్వారా చూపించండి. కర్ణాటకను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా మారుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అనువాదకుడి పొరపాటుతో ప్రజలు, కర్ణాటక బీజేపీ నాయకులు అవాక్కయ్యారు.

దావనగేరే జిల్లా చల్లకెరెలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో షా ప్రసంగాన్ని ప్రహ్లాద్ జోషీ అనువాదిస్తూ వస్తున్నాడు. కానీ ఒక్క చోట మాత్రం ఘోర తప్పిదం చేసేశాడు.‘‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని సర్వ నాశనం చేస్తారు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిందేమీ లేదు. దేశాన్నిఆయన నాశనం చేయడం ఖాయం.. దయచేసి ఆయనకు ఓటు వేయండి’’ అని అనడంతో అందరూ షాక్ కు గురయ్యారు. మన పార్టీ మీటింగ్ లో మనల్ని మనం తిట్టుకోవడం ఏమిటి అని అక్కడ కన్నడ అర్థం అయిన బీజేపీ నేతలు షాక్ కు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here