ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన వ్య‌క్తి.. అట‌వీ ప్రాంతంలో, త‌ల ఛిద్ర‌మైన స్థితిలో!

భువ‌నేశ్వ‌ర్‌: త‌న స్నేహితుడి పెళ్లికి హాజ‌ర‌వ‌డానికి రెండు రోజుల కింద‌ట ఇంట్లో నుంచి బ‌య‌లుదేరి వెళ్లిన ఓ వ్య‌క్తి.. చివ‌రికి ఇలా అట‌వీ ప్రాంతంలో మృత‌దేహ‌మై క‌నిపించాడు. త‌ల‌పై బండ‌రాళ్ల‌తో మోది హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని గంజాం జిల్లా ఛ‌త్రాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని రెడిక‌సాహి గ్రామంలో చోటు చేసుకుంది.

మృతుడి పేరు శ్రీ‌నురావు. త‌న స్నేహితుడి పెళ్లి కోసం అత‌ను సోమ‌వారం ఇంట్లో నుంచి బ‌య‌లుదేరి వెళ్లాడు. ఒక‌రోజు గ‌డిచిన‌ప్ప‌టికీ.. అత‌ని జాడ తెలియ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు స్నేహితుడిని ఆరా తీశారు. శ్రీ‌నురావు త‌న పెళ్లికి రాలేద‌ని చెప్పాడు. దీనితో కుటుంబ స‌భ్యులు ఛ‌త్రాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీ‌నురావు కోసం గాలిస్తుండ‌గానే.. రెడిక‌సాహి గ్రామ శివార్ల‌లో ఉన్న అట‌వీ ప్రాంతంలో మృత‌దేహ‌మై క‌నిపించాడు.

మృత‌దేహం రంగు మారింద‌ని, విష ప్ర‌యోగం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికితోడు- త‌ల ఛిద్రం చేసి ఉంది. హ‌త్య‌చేయ‌డానికి ముందు చిత్ర‌హింస‌ల‌కు గురి చేసిన‌ట్టు శ‌రీరంపై గాయాలు ఉన్నాయి. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీ‌నురావు మిస్సింగ్ కేసును హ‌త్య‌గా బ‌ద‌లాయించారు. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here