క్లైమాక్స్ సీన్‌ త‌రహాలో గాల్లోకి ఎగిరి.. ఇలా త‌ల‌కిందులుగా!

రాయ‌చూరు: రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించిన తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం ఈ ఫొటో. క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరు జిల్లాలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తోన్న ఓ పిక‌ప్ వెహిక‌ల్ టైరు పేలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. టైరు పేలిన వెంట‌నే వాహ‌నం సినీ ఫ‌క్కీలో గాల్లోకి ఎగిరింది. సుమారు 10 అడుగులు మేర ఎగిరిన త‌రువాత త‌ల‌కిందులుగ భూమి మీదికి వాలింది.

ఈ ఘ‌ట‌న‌లో ఆ పికప్ వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని లింగ‌సుగూర్ తాలూకా ముద్గ‌ళ్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముద్గ‌ళ్ నుంచి చిత్తాపుర వెళ్తుండ‌గా.. టైరు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ముద్గ‌ళ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here