హాలీవుడ్ న‌టుడితో ప్రియాంక చోప్రా స‌హ‌జీవ‌నం! ఇద్ద‌రి మ‌ధ్యా ఏజ్ గ్యాప్‌.. చాలా పెద్ద‌దే!

హాలీవుడ్ హ‌వా న‌డిపిస్తోన్న బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ఓ టీవీ న‌టుడితో స‌హ‌జీవ‌నం సాగిస్తోంది. చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. ఆ న‌టుడి పేరు నిక్ జోనాస్‌. టీవీ న‌టుడు, క్వాంటికోలో ప్రియాంక‌తో పాటు క‌లిసి న‌టించాడు. అప్ప‌టి నుంచే వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ట‌.

ప్రియాంక చోప్రా వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. ఆమె స‌హ‌జీవ‌నం చేస్తోన్న నిక్ జోనాస్ వ‌య‌స్సు 25. ఇద్ద‌రి మ‌ధ్య ప‌దేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ.. ఫ‌ర్వాలేద‌ట‌. నిక్ జోనాస్‌తో క‌లిసి ప్రియాంక చోప్రా స‌హ‌జీవ‌నం చేస్తోన్న వార్త‌లు ఇదివ‌ర‌కే వినిపించాయి. దాన్ని ధృవీక‌రించే ఎలాంటి ఆధారాలూ దొర‌క‌లేదు.

తాజాగా- ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒకే రంగు డ్రెస్‌లో, ఒకే కారులో నుంచి దిగ‌డం.. ఈ గ్యాసిప్స్‌పై పెట్రోలు పోసిన‌ట్ట‌యింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోలు దానికి సంబంధించిన‌వే. అమెరికాలోని వెస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఒకే కారులో వెళ్లారు ఆ ఇద్ద‌రూ.

ఈ నెల 31వ తేదీన ఆ రెస్టారెంట్‌లో ఓ మూల‌నున్న టేబుల్ చూసుకుని గంటల కొద్దీ గ‌డిపారు. రెస్టారెంట్‌లో కార్న‌ర్ టేబుల్ వ‌ద్ద న‌ల్ల‌రంగు డ్రెస్‌లో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ అద్దిరిపోయిందంటున్నారు చూసిన జ‌నం. దీనికి ప్రియాంక చోప్రా ఏమ‌ని స‌మాధాన‌మిస్తుందో మ‌రి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here