కండోమ్ యాడ్‌లో నటించి, బాలీవుడ్‌లో వేడి పుట్టిస్తోన్న తెలుగ‌మ్మాయి: టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఒకే ఒక్క సినిమా. ఆమె జీవితాన్ని మార్చివేసింది. అప్ క‌మింగ్ యాక్ట్రెస్‌గా అప్ప‌టిదాకా ఉన్న ముద్ర‌ను తుడిచేసింది. స్టార్ హోదాను క‌ట్టబెట్టింది. ఆమే శోభిత ధూలిపాళ్ల‌.

ఈ ధూలిపాళ్ల అనే పేరు మ‌న నేటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంద‌నుకుంటున్నారా? నేటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం కాదు. ఆమె తెలుగ‌మ్మాయే. ముంబైలో స్థిర‌ప‌డింది.

2013 మిస్ ఎర్త్ టైటిల్‌ను గెలుచుకున్న త‌రువాత ఆమె ఇక వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన ప‌ని రాలేదు. ఆమె న‌టించిన ర‌మ‌న్ రాఘ‌వ్ 2.0 మూవీ.. శోభిత‌కు హాట్‌బేబ్‌గా పేరు తెచ్చి పెట్టింది.

ఆ సినిమాలో ఆమె బోల్డ‌న్ని బోల్డ్ సీన్ల‌లో న‌టించింది. గ‌తంలో కింగ్‌ఫిష‌ర్ క్యాలెండ‌ర్‌పైనా క‌నిపించిందా వైజాగ్ అమ్మాయి. ఆమె తాజా చిత్రం క‌లాకండ్ కూడా రిలీజైంది. ఇందులో సైఫ్ అలీఖాన్ హీరో.

ఇక తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది శోభిత‌. అడివి శేష్ న‌టించిన `గూఢ‌చారి`లో న‌టించింది. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ శనివారం సాయంత్రం విడుద‌లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here