రోడ్డు మీద ఓ సామాన్యుడిలా అప్ప‌డాలు అమ్ముతున్న ఈ సూప‌ర్‌స్టార్ ఎవ‌రో చెప్పుకోగ‌ల‌రా?

జైపూర్‌: ఎర్ర తుండువాను భుజంపై వేసుకుని, ఓ డొక్కు సైకిల్‌పై వెనుక‌ల పెద్ద గంప‌లో అప్ప‌డాలు అమ్ముతూ కనిపిస్తోన్న ఈ సూప‌ర్‌స్టార్‌ను ఛ‌ప్పున గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే. ఎందుకంటే.. అత‌ని గెట‌ప్ అలా సెట‌ప్ అయిపోయింద‌న్న‌మాట‌.

ఆ సూప‌ర్‌స్టార్‌.. హృతిక్ రోష‌న్‌. త‌న తాజా చిత్రం `సూప‌ర్ 30` కోసం ఆయ‌న ఈ గెట‌ప్‌ను వేశారు. బిహార్‌కు చెందిన మ్యాథ‌మేటీషియ‌న్ ఆనంద్‌కుమార్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌కు 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సంభ‌ర్ ప‌ట్ట‌ణంలో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకొంటోంది. వికాస్ బెహ‌ల్ ద‌ర్శ‌కుడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here