గుల‌కరాయి సైజు ఉల్క భూమిని తాకితే..!

గుల‌క‌రాయి సైజు ఉల్క‌ ద‌క్షిణాఫ్రికాలో క‌ల‌క‌లం రేపింది. ద‌క్షిణాఫ్రికాలోని ఒట్టొస్‌డాల్‌, హ‌ర్టెబీస్‌ఫోన్‌టెయిన్ మ‌ధ్య ఈ ఉల్క భూమిని తాకింది. నేలను తాకిన వెంట‌నే పెద్ద శ‌బ్దం చేస్తూ పేలిపోయిందా ఉల్క‌. ఈ సంద‌ర్భంగా క‌ళ్లు మిర‌మిట్లు గొలిపేలా ఆ ప్రాంతం అంతా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను నాసా విడుద‌ల చేసింది. నాసా ఉప‌గ్ర‌హం దీన్ని చిత్రీక‌రించింది. నిజానికి- ఉల్కలు భూమి దాకా చేర‌వు.

భూ క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించిన వెంట‌నే అవి మండిపోతాయి. నుసిగా మారతాయి. ఈ ఉల్క మాత్రం భూ క‌క్ష్య‌ను దాటుకుని వ‌చ్చింది. ద‌క్షిణాఫ్రికా భూభాగంలోని ఒట్టొస్‌డాల్‌, హ‌ర్టెబీస్‌ఫోన్‌టెయిన్ మ‌ధ్య భూమిని తాకింది. అదో కుగ్రామం. ఓ రైతు ఇల్లు, దాని ముందు పార్క్ చేసిన పిక‌ప్ వ్యాన్‌. షెడ్డులో ఉంచిన ట్రాక్ట‌ర్‌.. ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ఇలా ఓ ఉల్క భూమిని ఢీ కొన‌డం ఇది మూడోసారి అని నాసా వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here