పెళ్ల‌యిన ఆనందంలో బొకేను పైకి ఎగ‌రేసింది..అదే ఆమె చేసిన పొర‌పాటు!

బీజింగ్‌: త‌న‌కు పెళ్ల‌యిన ఆనందంలో ఓ యువ‌తి చేతిలో ఉన్న బొకేను పైకి ఎగ‌రేసింది. అదే ఆమె చేసిన పొర‌పాటు. ఆమె ఎగ‌రేసిన బొకే త‌గిలి.. సీలింగ్ మొత్తం ఊడి కింద‌ప‌డింది. అవ‌న్నీ టైల్స్‌. సీలింగ్ టైల్స్ ఊడి కింద ప‌డ‌టంతో అతిథుల‌కు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న చైనాలోని గ్వాంగ్ఝౌ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న‌దిగా చెబుతున్నారు.

చైనాలో వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ `యుకో`లో దీనికి సంబంధించిన దీన్ని పోస్ట్ చేశారు. రిసెప్ష‌న్‌కు వ‌చ్చిన అతిథులు పెళ్లి కుమార్తెకు బొకే ఇవ్వ‌డం.. దాన్ని ఆమె ఆనందంతో పైకి ఎగరేయ‌డం, ఆ వెంట‌నే- సీలింగ్ టైల్స్ వ‌రుసగా ఊడి కింద ప‌డ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ ఘ‌ట‌న త‌రువాత ఆ వెడ్డింగ్ పార్టీని ఊరకే వ‌ద‌ల్లేద‌ట ఫంక్ష‌న్ హాల్ యాజ‌మాన్యం. న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాల్సి వ‌చ్చింద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here