బాక్సింగ్ టైటిల్ కొట్టాడు..ఆ సంబరంలో!

లండ‌న్‌: అత‌నో బాక్స‌ర్‌. పేరు స్కాట్ వెస్ట్‌గార్త్‌. టైటిల్ గెల‌వాల‌న్న బ‌ల‌మైన కోరిక‌తో బ‌రిలో దూకాడు. ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేశాడు. తాను క‌ల‌లుగ‌న్న లైట్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను గెలిచాడు.

ఆ త‌రువాత కొద్దిసేప‌టికే గుండెపోటుతో కుప్ప‌కూలిపోయాడు. ఈ ఘ‌ట‌న జ‌ర్మ‌నీలో చోటు చేసుకుంది. బ్రిట‌న్‌కు చెందిన స్కాట్ వెస్ట్‌గార్త్ జ‌ర్మ‌నీలో జ‌రిగిన ఛాంపియ‌న్ షిప్ బ‌రిలో దిగాడు.

శనివారం జరిగిన ఇంగ్లిష్‌ టైటిల్‌ ఫైట్‌లో త‌న ప్రత్యర్థి డెక్‌ స్పెల్‌మన్‌పై విజయం సాధించాడు. లైట్ హెవీ వెయిట్ టైటిల్‌ను సాధించారు.

మ్యాచ్ ముగిసి, టైటిల్ అందుకున్న త‌రువాత బాక్సింగ్ బ‌రి వ‌ద్దే ఓ ఛాన‌ల్‌కు పోస్ట్ మ్యాచ్ ఇంట‌ర్వ్యూ ఇస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

 

మాట్లాడుతుండ‌గానే గుండెనొప్పితో చ‌తికిల ప‌డి విల‌విల్లాడాడు.అతనికి ప్రాథ‌మిక వైద్యాన్ని అందించారు. ఆసుప‌త్రికి తరలించారు.

 

మార్గ‌మ‌ధ్య‌లోనే వెస్ట్‌గార్త్ క‌న్నుమూశాడు. ఈ ఘ‌ట‌న బాక్సింగ్ ప్ర‌పంచాన్ని విషాదంలో ముంచెత్తింది. త్వ‌ర‌లో హెవీ వెయిట్ ఛాంపియ‌న్ షిప్ పోటీల బ‌రిలో దిగ‌డానికి స‌న్న‌ద్ధ‌మౌతున్నాడ‌ని స‌న్నిహితులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here