మీ అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన లెక్చరర్.. అతడి పరిస్థితి ఏమైందంటే..!

ఒకప్పుడు గురువును దైవంగా భావించేవారు. కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి వేరు.. చాలా మంది పిల్లలు గురువులకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. చిన్న వయసులోనే పిల్లలు ఎక్కడ చెడు సావాసాల బారిన పడతారోనని టీచర్లు అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటారు. అది కూడా వారి భవిష్యత్తు బాగుండాలనే.. అది పట్టించుకోకుండా గురువుల మీద కక్ష్య పెంచుకుంటే ఇలాంటి సంఘటనలే మళ్ళీ.. మళ్ళీ.. జరుగుతూ ఉంటాయి.

మీ అబ్బాయి అమ్మాయితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. దారి తప్పుతున్నాడు.. ఒకసారి అతన్ని మందలించండి అని ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు ఓ లెక్చరర్. అయితే ఆయన మీద కక్ష్య గట్టుకున్న ఆ కుర్రాడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

బుధవారం నాడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ రోహతక్ అధికారులు 19 సంవత్సరాల జగ్మల్ సింగ్ ను 40 ఏళ్ల రాజేష్ మాలిక్ ను హత్య చేసిన కేసులో అరెస్ట్ చేశారు. సోనాపేట్ జిల్లాలోని పీప్లి గ్రామంలో ఉన్న షాహీద్ దల్బీర్ సింగ్ ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ గా రాజేష్ మాలిక్ పనిచేస్తున్నాడు. జగ్మల్ సింగ్ బి.ఏ. సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. రాజేష్ మాలిక్ ఒక రోజు జగ్మల్ ను క్లాస్ లో బాగా తిట్టాడు. అలాగే అమ్మాయితో ఎక్కువగా మాట్లాడుతున్నాడని అతడి తల్లిదండ్రులకు, అమ్మాయి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. దీన్ని జగ్మల్ మనసులో పెట్టుకున్నాడు.

ఆ ఘటన తర్వాత జగ్మల్ తో ఆ అమ్మాయి కూడా పట్టించుకోకపోవడంతో లెక్చరర్ రాజేష్ మాలిక్ పై కోపం మరీ ఎక్కువైంది. దాదాపు ఒక నెల రోజులకు పైగా రాజేష్ ను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు జగ్మల్.. మంగళవారం రోజున తన అంకుల్ కి చెందిన లైసెన్స్ రివాల్వర్ ను కొట్టేశాడు జగ్మల్.. ఆ తర్వాత దాన్ని తీసుకొని స్కూల్ కు వెళ్ళాడు. ఓ గదిలో రాజేష్ ఉండగా అతడి మీద నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. రాజేష్ కూతురు ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడట. అయితే ఆ స్కూల్ క్లర్క్ జగ్మల్ ను చూశాడు. రాజేష్ ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా అప్పటికే చనిపోయాడని చెప్పారు వైద్యులు. దాదాపు 36 గంటల తర్వాత స్పెషల్ టీమ్ జగ్మల్ ను అదుపులోకి తీసుకుంది. జగ్మల్ కు సహాయం చేసిన ఇద్దరు స్నేహితులను, అతడి అంకుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here