క్రికెట్ కోచ్‌..పైశాచికం! ఇంటి వ‌ద్ద డ్రాప్ చేస్తానంటూ బైక్‌పై తీసుకెళ్లేవాడు!

గురువులా వ్య‌వ‌హ‌రించాల్సిన క్రికెట్ కోచ్ పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌న వ‌ద్ద క్రికెట్ శిక్ష‌ణ‌కు వ‌చ్చే పిల్ల‌లను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు.

ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. ఆ కోచ్ పేరు నాసిర్‌. బెంగ‌ళూరు య‌ల‌హంక‌లో క్రికెట్ కోచింగ్ సెంట‌ర్‌ను నిర్వ‌హిస్తున్నాడు.

ప‌లువురు పిల్ల‌లు అత‌ని వ‌ద్ద‌కు క్రికెట్ శిక్ష‌ణ కోసం వ‌స్తుంటారు. వారిలో 13 ఏళ్ల బాలుడిపై నాసిర్ క‌న్నుప‌డింది. అత‌నిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతుండేవాడు.

ఇంటి వ‌ద్ద డ్రాప్ చేస్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని జీకేవీకే స‌మీపంలోని నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. మూడురోజులుగా ఇదే తంతుగా కొన‌సాగుతుండ‌టంతో భ‌య‌ప‌డ్డ ఆ బాలుడు త‌న త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

దీనితో వారు య‌ల‌హంక పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. నాసిర్‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. అత‌ణ్ణి అరెస్టు చేశారు. తాను నేరం చేసిన‌ట్టు నాసిర్ అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here