ఏడేళ్ల పిల్లాడి త‌ల్లితో వివాహేత‌ర సంబంధం: అడ్డుగా ఉన్నాడ‌ని షూ లేస్‌తో ఉరి బిగించి..!

రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఏడేళ్ల విద్యార్థిని అత్యంత దారుణంగా హ‌త‌మార్చాడు ఓ యువ‌కుడు. ఆ హంత‌కుడు ఆ విద్యార్థికి ట్యూష‌న్ చెప్పే టీచ‌ర్.

విద్యార్థి త‌ల్లితో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌నే కార‌ణంతో విద్యార్థిని షూ లేస్‌తో ఉరి బిగించి హ‌త‌మార్చాడు.

మృత‌దేహాన్ని గోనెసంచిలో దాచిపెట్టి, దాన్ని బైక్‌పై పెట్టుకుని న‌గ‌రానికి 13 కిలోమీట‌ర్ల దూరంలో ప‌డేసి వ‌చ్చాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బారాగ‌ఢ్‌లో చోటు చేసుకుంది.

విద్యార్థి పేరు భ‌ర‌త్‌. స్థానిక క్రైస్ట్ స్కూల్‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి బారాగ‌ఢ్‌లో నివాసం ఉంటున్నాడు. ఆరు నెల‌ల కిందటి నుంచి ట్యూష‌న్‌కు వెళ్తున్నాడు.

దీనితో.. ట్యూష‌న్ మాస్ట‌ర్ విశాల్ రుపాణితో అత‌ని త‌ల్లి ఆశా (పేరుమార్చాం)కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది.

త‌మ అక్ర‌మ సంబంధానికి భ‌ర‌త్ అడ్డుగా ఉన్నాడ‌ని భావించిన రూపాణి అత‌ణ్ణి హ‌త‌మార్చాల‌ని ప్లాన్ వేశాడు. స్కూల్ వ‌దిలిన త‌రువాత త‌న‌తో పాటు తీసుకెళ్లాడు.

దీనికి సంబంధించిన విజువ‌ల్స్ స్కూల్‌లో అమ‌ర్చిన సీసీటీవీల్లో స్ప‌ష్టంగా రికార్డ‌య్యాయి.

షూ లేస్‌తో గొంతు బిగించి చంపిన త‌రువాత భ‌ర‌త్ మృత‌దేహాన్ని గోనెసంచిలో తీసుకుని రావ‌డం, దాన్ని స్కూటర్‌పై పెట్టుకుని తీసుకెళ్ల‌డం వంటి విజువ‌ల్స్ అన్నీ ట్రాఫిక్ సిగ్న‌ళ్ల వ‌ద్ద‌, టోల్‌గేట్ వ‌ద్ద అమ‌ర్చిన సీసీ టీవీల్లో క‌నిపించాయి.

దీనితో- పోలీసులు హంత‌కున్ని సులువుగానే ప‌ట్టుకోగ‌లిగారు. అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఆశాతో ఉన్న అక్ర‌మ సంబంధం వెలుగులోకి వ‌చ్చింది. మ‌రోవంక‌- భ‌ర‌త్ తండ్రి శోక‌స‌ముద్రంలో మునిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here