లిఫ్ట్ లో ఉన్న బటన్స్ పై ఉచ్ఛ పోశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఏ పనైనా చేసేటప్పుడు అది సరైనదా.. కాదా.. అనేది ఒక్కసారి ఆలోచించాలి. చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుండే అలవరచుకోవాలి. వాటిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తే మాత్రం ఇలానే ఉంటది. ఓ కుర్రాడు లిఫ్ట్ లో ఉన్న బటన్స్ మీద కావాలనే ఉచ్చ పోశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది తెలుసుకొంది.

ఓ పేరు తెలియని ఓ కుర్రాడు లిఫ్ట్ లోకి ఎక్కాడు.. అతడు లోపలికి రావాడం సీసీటీవీలో కూడా నమోదైంది. అతడు వచ్చి ఊరికే ఉండచ్చు కదా.. కొవ్వు పట్టి లిఫ్ట్ లో ఉన్న బటన్స్ మీదకు ఉచ్ఛ పోశాడు. ఇక తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చేసిందని అనుకున్న ఆ పిల్లాడు.. బయటకు వెళ్ళిపోబోతుండగా లిఫ్ట్ డోర్లు తెరచుకోలేదు. పైకీ కిందకు లిఫ్ట్ ఊగడం మొదలైంది. ఆ తర్వాత ఇక చేసేది లేక ఏ బటన్స్ మీదనైతే ఉచ్ఛ పోశాడో ఆ బటన్స్ ను తన చేతులతోనే నొక్కాడు. అయినప్పటికీ ఆ లిఫ్ట్ డోర్లు తెరచుకోలేదు. లిఫ్ట్ డోర్లు తెరచుకోకపోవడంతో కుర్రాడు చాలా భయపడిపోయాడు. ఇక లిఫ్ట్ లో కరెంట్ కూడా పోవడంతో చాలా భయపడిపోయాడు. అతడు బటన్స్ మీద ఉచ్ఛ పోయడం వలన లిఫ్ట్ సరిగా పనిచేయలేదు.. కొద్ది సేపటి తర్వాత బిల్డింగ్ మెయింటైనెన్స్ టీమ్ వచ్చి అతన్ని బయటకు తీసింది. తాను చేసిన తప్పుకు అతడే బాధ్యుడు అయ్యాడు. అతడు చేసిన పని మొత్తం లిఫ్ట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చైనాలోని చాంగ్క్వింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here