అమ్మాయికి మే 7న పెళ్ళి.. చివరిసారిగా కలుద్దాం రా అని పిలిచిన ప్రేమికుడు.. ఆ తర్వాత..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని సుల్తాన్ పూర్ జిల్లాలో ఓ ప్రేమజంట శవాలను స్థానికులు చూడడంతో ఆ ప్రాంతమంతా జనాలతో నిండిపోయింది. ఆ జంట తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. చనిపోయిన యువతికి మే 7న పెళ్ళి ఉందట. పోలీసులు శవాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అంతేకాకుండా ఈ హత్యలు ఏమైనా పరువు హత్యలు అయుండచ్చని భావిస్తున్నారు.

కట్ ఘరా గ్రామానికి చెందిన రామ్ తీర్థ్ కూతురు 18 ఏళ్ల రేణూకు అజయ్ కుమార్ అనే వ్యక్తితో మే 7న పెళ్ళి నిశ్చయించారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తీ చేశారు. అయితే పక్కనే ఉన్న గ్రామానికి చెందిన మోహన్ అనే 20 ఏళ్ల వ్యక్తితో రేణూ అఫైర్ నడుస్తోంది. మోహన్ కు రేణూ వాళ్ళ ఊరిలో బంధువులు కూడా ఉన్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో మోహన్ తన ఇంటి నుండి బయటకు వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. కానీ అతడు తిరిగి రాలేదు.

కట్ ఘరా గ్రామానికి చాలా దూరంలో నిర్జన ప్రాంతంలో వీరిద్దరి శవాలు లభించాయి. వీళ్ళ తలలో తూటాలు దిగాయి. అంతేకాకుండా అక్కడే ఒక తపంచా కూడా స్వాధీనం చేసుకున్నారు. యువతి స్నేహితురాలి కథనం ప్రకారం మోహన్ రేణూతో నీ పెళ్ళి ఎలాగూ అయిపోతుంది ఒకసారి కలుద్దాం చివరిసారిగా అని అడిగాడట.. కలవాలని పిలిచి అతడే చంపి.. తనకు తాను కాల్చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ చనిపోవాలని భావించారా.. లేక పరువు కోసం హత్య జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here