పాము కాటుకు మాంత్రికుడి దగ్గరకు వెళ్ళారు.. రెండోసారి అదే పాముతో కాటు వేయించుకోమన్నాడు..!

ప్రపంచం ఓ వైపు ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఆనందపడిపోతూ ఉంటే.. మరో వైపు ఇంకా మూఢనమ్మకాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన యువకుడిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకుండా ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అయితే అతడు ఇంకోసారి అదే పాముతో కాటు వేయించుకోవాలని సలహా ఇచ్చాడు. వేరే ఎవరైనా అయింటే నమ్మకపోయేవాళ్ళేమో.. కానీ నమ్మారు కూడా..!

బీహార్ లోని నారాయణపూర్ గ్రామంలో ఓ యువకుడిని త్రాచుపాము కరిచింది. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకుండా ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అయితే ఆ తాంత్రికుడు ఆ యువకుడి కుటుంబ సభ్యులతో ఏ పాము అయితే ఆ కుర్రాడిని కరిచిందో అదే పాముతో మరోసారి కాటు వేయిస్తే ఆ కుర్రాడికి ఏమీ కాదు.. లేచి కూర్చొంటాడు అని చెప్పాడు. అతడి మాటలు విన్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు తాంత్రికుడు చెప్పినట్లే చేశారు. రెండోసారి కూడా పాముతో కాటు వేయించారు.

గంటలు గడుస్తున్నా కూడా ఆ కుర్రాడిలో చలనం రాలేదు. దాదాపు 48 గంటల పాటూ ఆ కుర్రాడికి క్షుద్రపూజలు నిర్వహించాడు ఆ తాంత్రికుడు. తీరా ఆ కుర్రాడిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా చనిపోయాడని వైద్యులు తేల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బీహార్ లోని చాలా గ్రామాల్లో పరిస్థితి ఇలానే ఉందట.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మాంత్రికులనే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here