అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ వేధింపులట..!

ఆన్ లైన్ లో సాధారణంగా ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదురవుతుంటాయి. ఈ లైంగిక వేధింపులు అమ్మాయిలకే ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. అమ్మాయి పేరు కనిపిస్తే చాలు.. ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టేసి వాళ్ళ వెంటపడుతూ ఉంటారు. అయితే అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ వేధింపులకు గురవుతూ ఉన్నారట. ఇటీవలే చేసిన సర్వేలో తేలింది అదేనట..!

చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలతో పోల్చుకుంటే అధికంగా సెక్సువల్ కంటెంట్లు వస్తూ ఉన్నాయట. అందులో పోర్న్ ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. 2009 నుండి నిర్వహించిన సర్వేలో తెలిసింది ఇదే. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న యువకుల దగ్గర నుండి.. చిన్న చిన్న పిల్లల వరకూ ఇదే జరుగుతోందని ఇంటర్ పోల్ స్పష్టం చేసింది. దాదాపు 12000 మంది బాధితులలో 60శాతం మంది తక్కువ వయసు ఉన్నవాళ్ళేనట..!

అంతేకాకుండా చిన్న పిల్లల మీద కూడా లైంగిక వేధింపులు పెరిగిపోయాయని.. మగపిల్లలను కూడా విడిచిపెట్టడం లేదని బ్యాంకాక్ కు చెందిన ఓ ఎన్జీవో చేసిన సర్వేలో తేలింది. రోజు రోజుకీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోందని.. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు సర్వే నిర్వాహకులు. లైంగికంగా వేధిస్తున్న వారి గురించి పిల్లలు చెప్పడానికి జంకుతారని.. అలాంటప్పుడు పిల్లలతో శాంతంగా మాట్లాడి విషయాన్ని బయటకు తీసుకొని రావాలని సూచిస్తున్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు ఉన్న తేడా ఏమిటో చెప్పడం పెద్దల బాధ్యత అని సర్వే నిర్వాహకులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here