ఆ చిన్నారికి మూడు కాళ్లు! రెండు కాళ్ల మ‌ధ్య‌న పుట్టుకొచ్చింది..

బీజింగ్‌: చైనా డాక్ట‌ర్లు ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. మూడు కాళ్ల‌తో జ‌న్మించిన ఓ బాబుకు విజ‌య‌వంతంగా శ‌స్త్ర చికిత్స చేశారు. మూడోకాలును తొల‌గించారు. ఏడాది కూడా నిండ‌క ముందే అంటే.. 11 నెల‌ల వ‌య‌స్సులోనే ఆ చిన్నారికి ఆప‌రేష‌న్ చేశారు. ఆ బాబు పేరు మా యోంగ్‌ఫెయ్‌. చైనాలోని గ్జిన్జియాంగ్‌లో ఈ బాబు జ‌న్మించాడు. పుట్టుక‌తోనే మూడు కాళ్లొచ్చాయి.

రెండు కాళ్ల మ‌ధ్య‌న మూడో కాలు పుట్టుకొచ్చింది. నిజానికి ఆరు నెల‌ల్లోపే ఈ కాలును తొల‌గించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఆ బాబు త‌ల్లిదండ్రుల ఆర్థిక ప‌రిస్థితులు ఇందుకు స‌హ‌క‌రించ‌లేదు.

దీనితో ఈ కేసును డాక్ట‌ర్లు ఫుడాన్ యూనివ‌ర్శిటీకి అనుబంధంగా ప‌నిచేస్తోన్న షాంఘై ప‌బ్లిక్ హెల్త్ క్లినిక‌ల్‌కు బ‌ద‌లాయించారు. అక్క‌డ బాబును ప‌రిశీలించిన యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఛెన్‌.. శ‌స్త్ర చికిత్స చేశారు. పైగోపగ‌స్ పారాసిటిక‌స్ ప్ర‌భావం వ‌ల్ల మూడో కాలు పుట్టుకొచ్చింద‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here