అక్కడ బ్రహ్మానందం ఏడుస్తుంటే..!

గుండు హనుమంతరావు మనల్ని వదిలి వెళ్ళిపోవడం తీరని లోటు..! సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో బాధపడ్డారు. గుండు హనుమంతరావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కొన్ని నెలల క్రితం గుండు హనుమంతరావుకు ఆపరేషన్ కు డబ్బులు లేకపోతే చిరంజీవి ఆదుకున్నారని.. ప్రస్తుతం బాగానే ఉన్నారని అన్నారు. కానీ అనుకోకుండా గుండు హనుమంతరావు స్వర్గస్థులయ్యారు. ఇక గుండు హనుమంతరావును కడసారి చూసుకుందామని వచ్చిన బ్రహ్మానందం వెక్కివెక్కి ఏడ్చారు. ఆయనను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ.. వీరంతా మంచి మిత్రులు.. గతంలోనే ఎం.ఎస్., ధర్మవరం సుబ్రహ్మణ్యం దూరమవ్వగా.. ఇప్పుడు గుండు హనుమంతరావు కూడా దూరమవ్వడంతో బ్రహ్మానందం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం వినగానే తనలో ఏదో తెలియని అలజడి వణుకు వచ్చాయని బ్రహ్మానందం అన్నారు. హనుమంతరావు కొడుకు ఆదిత్య ను హత్తుకుని బోరుమని విలపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here