తిరుమలలో బ్రహ్మానందం సెటైర్లే.. సెటైర్లు..!

తిరుమల శ్రీవారిని టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం దర్శించుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన బ్రహ్మానందం మీడియా సిబ్బందితో మాట్లాడారు. అలాగే పలు సెటైర్లు కూడా వేసుకుంటూ వచ్చారు. అలాగే అభిమానులతో కూడా నేను నడుస్తూ ఉంటాను.. మీరు కావాలంటే ఫోటోలు తీసుకోండి అని సున్నితంగా చెప్పారు.

వెనక్కు వెనక్కు నడుస్తూ బ్రహ్మానందం ఫొటోలను తీసే వాళ్ళతో‘కొన్నాళ్లకు మీకు ఇలా వెనక్కు వెనక్కు నడవడమే అలవాటైపోతుంది..’ అని బ్రహ్మీ చమత్కరించాడు. ‘ఆచారి అమెరికా యాత్ర సినిమా..’ అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ‘లోపలంతా ఆచారులే..’ అంటూ శ్రీవారి గుడి వైపు చూపించారు. కొన్ని ప్రశ్నలకు‘మీరు అడగడం.. నేను చెప్పడం..’అంటూ మీడియా ప్రతినిధులను తప్పించుకుని వెళ్లిపోయారు. బ్రహ్మానందం కీలక పాత్ర చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అయితే భరత్ అనే నేను, అవెంజర్స్ దెబ్బకు సినిమా పెద్దగా నిలబడలేకపోయిందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here