ఆగ‌స్టు 3న వ‌స్తున్నాడు  ‘బ్రాండ్ బాబు’

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ జంటగా ప్రభాకర్‌.పి దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్‌బాబు’. ఆగస్ట్‌ 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సమర్పకుడు మారుతి చెప్పిన విశేషాలు.

‘బ్రాండ్‌బాబు’  ఆలోచన స‌మాజంలోంచి వచ్చిన‌దే
నాకైతే బ్రాండ్స్‌ అంటే పిచ్చి లేదు. ఎందుకంటే నేను మిడిల్‌ క్లాస్‌ జీవితానికి అలవాటు పడిన వాడిని. అయితే చాలా మందికి బ్రాండ్స్‌ అంటే పిచ్చి ఉంది. చాలా మంది బ్రాండ్ ఉన్న వస్తువులను చూపిస్తూ గొప్పలు పోతుంటారు. కొందరైతే బ్రాండ్స్‌ ఉంటేనే మనుషులతో కూడా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని నేను చాలా మందినే గమనించాను. అలాంటి బ్రాండ్స్‌పై ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. కేవలం బ్రాండ్‌ గురించే ఆలోచించే ఓ టిపికల్‌ ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్నాను. అలాంటి కుటుంబంలో బ్రాండ్‌ల గురించి ఆలోచించే ఓ కుర్రాడు.. ఎలాంటి బ్రాండ్స్‌ లేని సాధారణమైన అమ్మాయిని లవ్‌ చేస్తే..అంటే అతనికి ప్రేమ విలువ తెలిస్తే.. ఎలా ఉంటుందనేదే బ్రాండ్‌బాబు కథ.

ప్ర‌భాక‌ర్ సీరియ‌ల్ అనుభ‌వం సినిమాకు ప‌నికొచ్చింది
నేను తొలిసారి కథ, మాటలు, స్క్రిప్ట్‌ పూర్తిగా అందించిన సినిమా ఇది. ఏదో బ్రాండ్‌లపై ఎంటర్‌టైనింగ్‌గా నవ్విద్దామని చేసిన సినిమా కాదు. మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది.  డైరెక్టర్‌ ప్రభాకర్‌ గురించి చెప్పాలంటే ప్రభాకర్‌కి సీరియల్స్‌ డైరెక్ట్‌ చేసిన అనుభవం ఉంది. అందుకే సీన్‌ పేపర్‌ రాగానే అందులో ఎమోషన్‌ని పట్టేసేవాడు. అదే కొత్త దర్శకులతో ఇదే కథను చేసుంటే.. కాస్త టెన్షన్‌ ఉండుండేది. ప్రభాకర్‌కి ఉన్న అనుభవానికి నా స్క్రిప్ట్‌ తోడైంది.

సుమంత్ శైలేంద్ర‌కు త‌గిన క‌థ బ్రాండ్ బాబు
ఎవరైనా కొత్త హీరో సినిమా వస్తుందంటే.. అసలు ఆ సినిమా ఎందుకు చూడాలి? అని ప్రేక్షకులు ఆలోచిస్తారు. అలాంటి సందర్భంలో సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే.. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. శైలేంద్రబాబుగారు నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. ఆయన తన కొడుకుని హీరోయిజం ఉన్న సినిమాతో కాకుండా ఎంటైర్‌టైనింగ్‌గా ఉండే సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్‌ చేయాలనుకున్నారు. ఆ సమయంలో నేను ఈ కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో సుమంత్‌ శైలేంద్ర హీరోగా ఈ సినిమా చేశాం. బ్రాండ్స్‌ పిచ్చి ఉండేవాళ్లకు ఓ యారగెన్స్‌ ఉండాలి. అలాంటి యారగెంట్‌ అట్యిట్యూడ్‌ను సుమంత్‌ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ చేశాడు.

నా కథ స్టార్ హీరోల‌కు న‌ప్పితే త‌ప్ప‌కుండా చేస్తా
నా దగ్గరున్న కథలను నేను సినిమాలుగా తీయాలంటే పదేళ్ల వరకు సరిపోతాయి. అదీగాక కొన్ని సంవత్సరాలు తర్వాత ట్రెండ్‌ మారిపోతుంటుంది. నేనే డైరెక్ట్‌ చేయాలనుకుంటే.. నేను అనుకున్న కథలు సినిమాలుగా తీయలేకపోవచ్చు. చిన్న చిన్న పాయింట్స్‌ బేస్‌ చేసుకుని ఎంటర్‌టైనింగ్‌గా సినిమాలు చేయడమే నా బలం. ముందు యు.వి.క్రియేషన్స్‌లో శర్వాతో ఈ కథను చేద్దామని అనుకున్నాను. అయితే శర్వా ఏదైనా క్యారెక్టరైజేషన్‌పై సినిమా చేద్దామనడంతో మహానుభావుడు సినిమా చేశాను. ‘బ్రాండ్‌బాబు’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు.

ఇప్పుడు శైల‌జా రెడ్డి అల్లుడుతో బిజీగా ఉన్నాను:
నేను మొదటి నుండి కథలతోనే ట్రావెల్‌ అవుతున్నాను. నాకు స్టార్‌ హీరోలతో చేయకూడదని కాదు.. వారికి కథ సూట్‌ అయిపోతుందని నాకు అనిపిస్తే నేను వాళ్లని కలిసి కథ నెరేట్‌ చేస్తాను. ఇప్పుడు ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here