బ్రాండ్ బాబు సెన్సార్ కంప్లీట్ – ఆగస్ట్ 3 న రిలీజ్

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రభాకర్‌.పి. దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం  సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో , టీజర్ కి మంచి స్పందన రాగా  ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమాపై మంచి అంచనాలున్నాయి..

నటీనటులు: సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌ తదితరులు

సాంకేతిక విభాగం:  ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి, ఆర్ట్‌: మురళి ఎస్‌.వి., దర్శకత్వం : ప్రభాకర్ పి, నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు, బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకం, మ్యూజిక్: జేబి, లిరిక్స్: పూర్ణచెర్రీ, కెమెరామెన్: కార్తీక్ ఫలణి, ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here