ఆయన అదృష్టం అలాంటిది.. ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్ళిచేసుకోబోతున్న ఫుట్ బాల్ స్టార్..!

బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ రొనాల్డిన్హో తన లేడీ ఫ్యాన్స్ కు డబుల్ హార్ట్ బ్రేక్ ఇవ్వనున్నాడు. ఇక మగవాళ్ళు కుళ్ళుకునేలా చేస్తున్నాడు. ఎందుకంటే రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్ళి చేసుకోబోతున్నాడు. అది కూడా ఒకేసారి..! ఆగస్టులో తాను ఒకేసారి ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజాలను పెళ్లాడతానని చెప్పాడు.

రియో డి జనీరో న్యూస్ పేపర్ ఓ డియా కథనం ప్రకారం.. ఇలా ముగ్గురు కలిసి జీవిత భాగస్వామ్యులు అవడం చాలా అరుదు అని తెలిపారు. ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజా రొనాల్డినోతో కలసి రియో డీజనీరోలో ఉన్న ఓ మాన్షన్ లో గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఉంటున్నారని, అమ్మాయిలిద్దరి మధ్యా ఎటువంటి గొడవలూ లేవని బ్రెజిల్ వార్తా సంస్థలు తెలిపాయి. రొనాల్డినో సైతం వీరిద్దరినీ ఒకేలా చూస్తున్నాడట. ఇక వీరి ముగ్గురి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు రానున్నారట. రియోలోని శాంటా మొనికా కండోమినియంలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. గతంలో కూడా రొనాల్డిన్హో తనకు ఒకరికంటే ఎక్కువ మందితో జీవితాన్ని షేర్ చేసుకోవాలని ఉందని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. అతడు చెప్పినట్లే జరుగుతోంది. కోయిల్హోను 2013 లో కలిసిన రొనాల్డిన్హో అప్పటి నుండి కలిసే ఉంటున్నాడు.. 2016 లో బీట్రెజ్ సౌజా వచ్చి వారితో కలిసిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here