కొరివితో త‌ల గోక్కోవ‌డం కాదు గానీ.. హెయిర్‌ క‌టింగ్ చేసుకున్నాడు!

`కొరివితో త‌ల గోక్కోవ‌డం.. ` అనే సామెత‌ను మ‌నం చాలాసార్లు విని ఉంటాం గానీ..ఆ సంద‌ర్భాన్ని మాత్రం చూసి ఉండం. ఇక్క‌డో వ్య‌క్తి అదే ప‌ని చేస్తున్నాడు. కొరివితో త‌ల గోక్కోవ‌డం కాదు గానీ.. హెయిర్ క‌టింగ్ చేసుకుంటున్నాడు.

జుట్టు పెరిగితే ఎవ‌రైనా ఏం చేస్తారు? బార్బ‌ర్ షాపుకెళ్లి హెయిర్ క‌టింగ్ చేయించుకుంటారు. ఇది స‌హజం. ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి మాత్రం కంప్లీట్ డిఫ‌రెంట్‌. హెయిర్ క‌టింగ్ కోసం బార్బ‌ర్ షాప్‌న‌కు వెళ్లే అల‌వాటు లేదేమో.

తీరిగ్గా కూర్చుని అద్దం ముందు పెట్టుకుని, మండుతున్న క‌ట్టెను ఓ దాన్ని చేత్తో ప‌ట్టుకుని, ఎక్క‌డ జుట్టు బాగా పెరిగి ఉంటే అక్క‌డ మంట పెట్టుకున్నాడు. బ్రెజిల్‌లో తీసిన‌ట్టుగా భావిస్తోన్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో భ‌లేగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఆయ‌న పేరేమిట‌న్న‌ది కూడా తెలియ రావట్లేదు. ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్న ఇంకో వ్య‌క్తి.. జుట్టు ఎక్క‌డెక్క‌డ పెరిగిందో చెబుతోంటే.. అక్క‌డ‌క‌క్క‌డ కొరివిని అంటించుకుని జుట్టును మంట‌బారిన పెడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here