క్రికెట్ మ్యాచ్ చూస్తూ.. ఎంజాయ్ చేస్తూ.. తాళి క‌ట్టిన వ‌రుడు!

తాళి క‌డుతూ క్రికెట్ మ్యాచ్ చూడ‌టంలో మునిగిపోయారు ఆ వ‌ధూవ‌రులు. అండ‌ర్-19 భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఖంగు తినిపిస్తోంటే ఎంజాయ్ చేశారు. మ్యాచ్ చూస్తూ.. పెళ్లి చేసుకున్నారు.

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచినందుకు వ‌ధూవ‌రులిద్ద‌రూ పెళ్లి పీట‌ల మీదే కౌగిలించుకుని మ‌రీ.. అభినంద‌న‌లు తెలుపుకొన్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ న‌గ‌ర‌లో చోటు చేసుకుంది.

చామ‌రాజ న‌గ‌రకు చెందిన కేఆర్ కార్తీక్‌, కేపీ శ్వేత వివాహం భ్ర‌మ‌రాంబ క‌ళ్యాణ‌మంట‌పంలో ఏర్పాటైంది. తాళి క‌ట్ట‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు అండ‌ర్‌-19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ఆరంభ‌మైంది.

ఇద్ద‌రూ క్రికెట్ ప్రియులే కావ‌డంతో, ఏకంగా పెళ్లి మంట‌పంలోనే భారీ స్క్రీన్‌ల‌ను ఏర్పాటు చేసి, క్రికెట్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. మ్యాచ్ చూస్తూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రిసెప్ష‌న్‌లోనూ ఇదే వ్య‌వ‌హారం కొన‌సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here