పెళ్ళికొడుకుకి బట్టతల ఉందని పెళ్ళికి నిరాకరించిన వధువు.. పెళ్ళికొడుకు ఏమి చేశాడంటే..!

ఈ మధ్య కాలంలో పెళ్ళి కాని అబ్బాయిలకు జుట్టు ఉండడం ఎంత తప్పనిసరో ఈ ఒక్క ఉదంతం చాలు.. పెళ్ళి కొడుకు డాక్టర్ అయినా కూడా అతడికి బట్టతల ఉందన్న కారణంతో పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించింది. పెళ్ళి కొడుకు.. పెళ్ళి కోసం అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. మొదట్లో అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత మరొకటి పూర్తీ అవుతూ వస్తున్నాయి. అక్కడి నుండి కళ్యాణ మంటపానికి కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి బంధువులు పెళ్ళికి నిరాకరించారు. ఎందుకు ఈ పెళ్ళి వద్దు అంటున్నారని అడగ్గా పెళ్ళి కొడుకుకు బట్టతల.. అది తమ అమ్మాయికి ఇష్టం లేదు.. అందుకే ఈ పెళ్ళికి నిరాకరిస్తున్నాం అని చెప్పింది. పెళ్ళి కొడుకు బంధువులు ఎంత సర్దిచెప్పినా కూడా అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకోలేదు.

ఢిల్లీ నుండి పెళ్ళి కొడుకు డాక్టర్ రవికుమార్ దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతియా గ్రామానికి వెళ్ళాడు. మొదట పెళ్ళి కూతురి బంధువులే పెళ్ళి కోసం తొందరపెట్టారు. పెళ్ళి కోసం వారి ఊరికి చేరారు.. అన్ని కార్యక్రమాలు పూర్తీ అయ్యాయి అప్పటికే.. వరమాలలు మార్చుకున్న తర్వాత రవి కుమార్ తలపాగా తీసేయగా అతడి తల మీద వెంట్రుకలు తక్కువగా ఉన్నాయని పెళ్ళి కూతురు భావించింది. అప్పటివరకూ ఫోటోలలో మాత్రమే ఆ అమ్మాయి పెళ్ళి కొడుకును చూసిందట.. దీంతో పెళ్ళికి నిరాకరించింది. ఇక ఒప్పించలేక బంధువులు చేతులెత్తేశారు.

అయితే పెళ్ళి కొడుకు రెండు రోజుల తర్వాత అదే ఊరిలో ఉన్న ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ఓ కూరగాయల వ్యాపారి కూతురు.. స్థానిక దేవాలయంలో అతడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రం లోని బేతియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here