పెళ్ల‌యిన రోజే భ‌ర్త‌ను మ‌ద్యంమ‌త్తులో ముంచి..అత‌ని వేషంలో మొద‌టి రాత్రి న‌వ‌వ‌ధువుపై అత్యాచారం!

త‌న ప్రేమ‌ను నిరాక‌రించి, వేరొక‌రిని పెళ్లి చేసుకుంద‌నే ఆగ్ర‌హంతో ర‌గిలిపోయాడు ఓ యువ‌కుడు. ఆ యువ‌తిపై ప‌గ తీర్చుకోవాల‌నుకున్నాడు. ఆమెకు వేరే వ్య‌క్తితో పెళ్ల‌యిన రోజే భ‌ర్త‌ను బంధించాడు. అత‌ని వేషంలో మొద‌టిరాత్రి గ‌దిలోకి వెళ్లాడు. న‌వ‌వ‌ధువుపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఈ దారుణ ఘ‌ట‌న కాంబోడియాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో కాంబోడియా ప్రేవెంగ్ ప్రావిన్స్‌లోని ఛుక్యేస్ గ్రామానికి చెందిన ఛోయెన్ ఛాన్‌సెంగ్ అనే 18 ఏళ్ల యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కాంబోడియా చ‌ట్టాల ప్ర‌కారం నిందితుడికి ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. బాధిత యువతి, నిందితుడు ఒకే గ్రామానికి చెందిన వారు. ఛోయెన్ ఛాన్‌సెంగ్‌తో ఆమెకు ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం ఉంది.

ఛోయెన్ ప్రేమ‌ను ఆమె నిరాక‌రించింది. వేరొక‌రితో పెళ్లికి సిద్ధ‌ప‌డింది. దీనితో ఆమెపై ప‌గ పెంచుకున్నాడు. ఆమె పెళ్లికి కూడా వెళ్లాడు. మొద‌టిరాత్రి వ‌రుడికి మ‌ద్యం తాగించాడు.

అత‌ని వెనుకే శోభ‌నం గ‌దికి వెళ్లాడు. కొంత‌సేప‌టి త‌రువాత వ‌రుడు మ‌ద్యం మ‌త్తులో నిద్ర‌పోగా..అత‌ని దుస్తులు ధ‌రించి భ‌ర్త‌గా న‌టించాడు. లైట్ల‌ను ఆర్పివేసి, వ‌ధువుపై అత్యాచారం చేశాడు.

చీక‌టిగా ఉండ‌టంతో మొద‌ట భ‌ర్తే అనుకున్న వ‌ధువుకు.. అస‌లు విష‌యం తెలిసింది. దీనితో ఆమె కేక‌లు వేసింది. ఈ విష‌యం తెలుసుకున్న భ‌ర్త‌, అత్త‌మామ‌లు అప్ప‌టిక‌ప్పుడు ఆమెను అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు. బాధిత యువ‌తి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here