అదృష్టం అంటే ఆమెదే! పెళ్లి కూతుర్ని ఫంక్ష‌న్ హాల్‌కు తీసుకొస్తూ..మంట‌ల్లో కాలిపోయిన హెలికాప్ట‌ర్‌!

నిజంగా అదృష్టం అంటే ఆమెదే. ప్రాణాపాయాన్ని తృటిలో త‌ప్పించుకోవ‌డం అంటే మాట‌లు కాదు. చివ‌రి నిమిషంలో ఆమె అప్ర‌మ‌త్తంగా ఉండి, ప్ర‌మాదం బారి నుంచి త‌ప్పించుకుంది. లేదంటే- మంట‌ల్లో మాడి మ‌స‌య్యుండేది. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చిన హెలికాప్ట‌ర్‌.. ప్ర‌మాదానికి గురైంది.

ఫంక్ష‌న్ హాల్ ఆవ‌ర‌ణ‌లో ల్యాండ్ అయ్యే స‌మ‌యంలో, హెలికాప్ట‌ర్ క్రాష్ అయ్యింది. క్రాష్ ల్యాండింగ్ స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగి హెలికాప్ట‌ర్ మొత్తం కాలిపోయింది. తుక్కు సామాన్ల‌కు ప‌నికొచ్చేలా త‌యారైంది. ఈ ఘ‌ట‌న బ్రెజిల్ రాజ‌ధాని సావోపోలోలో చోటు చేసుకుంది. సావోపోలోలోని ఓ వైన్‌యార్డ్‌లో త‌న కుమార్తె పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించడానికి ఏర్పాట్లు చేశాడో ఆసామి.

త‌న ఇంటి నుంచి పెళ్లి కుమార్తెను తీసుకుని రావ‌డానికి ఏకంగా హెలికాప్ట‌ర్‌నే ఏర్పాటు చేశాడు. అలా తీసుకుని రావ‌డాన్ని త‌న హోదాకు గుర్తింపుగా భావించాడు. అదే త‌న కుమార్తె ప్రాణాల మీదికి తెస్తుంద‌ని ఊహించ‌లేక‌పోయాడు. పెళ్లి కుమార్తె స‌హా మొత్తం న‌లుగురితో బ‌య‌లుదేరిన హెలికాప్ట‌ర్ వైన్‌యార్డ్‌లో ఏర్పాటు చేసిన ఫంక్ష‌న్‌హాల్ వ‌ద్ద ల్యాండ్ అయ్యే స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైంది. క్రాష్ అయింది.

దీన్ని ముందే గ‌మ‌నించిన పెళ్లి కుమార్తె, మిగ‌తా న‌లుగురు అమాంతం కిందికి దూకేశారు. మెత్త‌టి గ‌డ్డిలో ప‌డ‌టంతో పెద్ద‌గా గాయాలు కాలేదు. హెలికాప్ట‌ర్ మాత్రం గాల్లోనే మంట‌ల్లో చిక్కుకుంది. కుప్ప‌కూలిపోయి, ద‌గ్ధ‌మైంది. స్వ‌ల్ప గాయాలైన పెళ్లి కుమార్తెను చికిత్స చేశారు. పెళ్లి తంతు య‌థాప్ర‌కారం కొన‌సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here