పెళ్ళి రోజు చెప్పులు కొట్టేశాడని హంతకుడిగా మారిన పెళ్ళి కొడుకు..!

ఎంతో ఆనందంగా ఉండాల్సిన పెళ్ళి రోజు అతడిని ఓ హంతకుడిలా మార్చింది. చెప్పులు కొట్టేశాడన్న నెపంతో ఓ వ్యక్తిని పెళ్ళి కొడుకు.. అతని స్నేహితులు చితక్కొట్టారు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళగా చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన సూరజ్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

సురేంద్ర అనే వ్యక్తి మరి కొన్ని గంటల్లో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. అప్పటికే పెళ్ళి సందడి మొదలైంది. ఇంతలో అతడి చెప్పులు కనిపించలేదు. ఆ విషయం తన స్నేహితులకు కూడా చెప్పాడు. వారు ఎంతసేపు వెతికినా దొరకకపోవడంతో 42 సంవత్సరాల రామసరన్ మీద వాళ్లకు అనుమానం వచ్చింది. అతడే చెప్పు కాజేశారని భావించిన పెళ్ళి కొడుకు.. అతని స్నేహితులు కలిసి అతన్ని చితక్కొట్టారు. దీంతో కుప్పకూలిపోయిన రామసరన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు తాళలేక ఆ వ్యక్తి చనిపోయాడని వైద్యులు తెలిపారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సురేంద్రను, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here