ప్రధానిని గౌరవనీయులైన, శ్రీ అని సంబోధించలేదట.. అందుకు జవాన్ జీతం కట్..!

ప్రధానమంత్రి లాంటి వారి వారి గురించి మాట్లాడేటప్పుడు గౌరవ సూచకంగా శ్రీ, గౌరవనీయులైన అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అవేవీ సంబోధించలేదని ఓ జవాన్ కు వారం రోజుల జీతాన్ని ఇవ్వడం ఆపేశారు. అయితే ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆ జవాన్ కు జీతం ఇప్పిస్తానని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 21న పశ్చిమబెంగాల్‌లోని మహత్‌పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ 15వ బెటాలియన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రోజువారీ నిర్వహించే పరేడ్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ రిపోర్టు ఇస్తూ ‘మోదీ ప్రోగ్రాం’ అని పేర్కొన్నాడు. మోదీకి ముందు గౌరవసూచకంగా ఉపయోగించే ‘ఆనరబుల్’, ‘శ్రీ’ వంటి పదాలను ఉపయోగించకపోవడంతో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అనూప్ లాల్ భగత్ అతడి వేతనంలో ఏడు రోజుల కోత విధించారు.

ఈ విషయం మీడియాలో కూడా రావడంతో ప్రధాని దృష్టికి వెళ్ళింది. ఆయన జోక్యం చేసుకోవడంతో ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తూ విధించిన శిక్షను బీఎస్ఎఫ్ ఉపసంహరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here