బ‌డ్జెట్ త‌యారీ ఎందుకింత నిగూఢం!

మ‌రికొన్ని గంట‌ల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. దీనికోసం అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు రెడీ అయ్యాయి.

బడ్జెట్‌ తయారీ ప్రక్రియ అత్యంత రహస్యం. త‌యారీ ప్ర‌క్రియ మొత్తం అంతా క్టోజ్డ్‌ సర్క్యుట్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల పర్యవేక్షణలో కొన‌సాగుతుంది.

ఆర్థిక మంత్రిత్వ‌శాఖ కార్యాల‌యం ఉండే నార్త్ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్‌ ప్రెస్‌లో మాత్ర‌మే దీన్ని ముద్రిస్తారు.

బడ్జెట్ ప్ర‌తుల ముద్రణకు ముందు హల్వా వండుతారు. ఆ త‌రువాత అక్క‌డి అధికారుల‌కు బ‌యటి ప్రపంచంతో సంబంధాలు ఎంత‌మాత్ర‌మూ ఉండ‌వు.

నో మొబైల్‌ఫోన్‌, నో ఇన్ఫ‌ర్మేష‌న్‌. బ‌య‌టేం జ‌రుగుతోంద‌న్న విష‌యం వారికి తెలియ‌దు. చివ‌రికి ఇంట్లో వారితో కూడా మాట్లాడే అవ‌కాశ‌మే ఇవ్వ‌రు.

ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన త‌రువాతే వారు బ‌య‌టికి వెళ్ల‌డానికి అనుమ‌తి ఇస్తారు. బడ్జెట్‌ ప్రసంగానికి రెండు రోజుల ముందు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారులు రంగంలోకి దిగుతారు.

వారిని కూడా ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం పూర్తయ్యే వరకు ప్రింటింగ్‌ ప్రెస్‌నుంచి బయటికి వెళ్లడానికి అనుమతించరు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి పది నిమిషాల ముందు కేంద్ర కేబినెట్‌కు బడ్జెట్‌ సారాంశం అందజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here