10 వేల సంవ‌త్స‌రాల వ‌ర‌కు ప‌నిచేసే విచిత్ర‌మైన గ‌డియారం..ఖ‌ర్చెంతో తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయ్‌!

న్యూఢిల్లీ: విన‌డానికి ఆశ్చ‌ర్యంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజం. అక్ష‌రాలా 10 వేల సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఎలాంటి సాంకేతిక లోపాల‌కు ఆస్కార‌మే లేని ఓ విచిత్ర‌మైన గ‌డియారం ఇది. దీని నిర్మాణం అమెరికా టెక్సాస్ సిటీ ప‌డ‌మ‌టి కొండ‌ల్లో మొద‌లైంది.

దీని ఖ‌ర్చెంతో తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయ్‌. అమెరిక‌న్ క‌రెన్సీలో 42 మిలియ‌న్ డాల‌ర్లు. మ‌న దేశీయ క‌రెన్సీతో పోల్చుకుంటే దాదాపు 275 కోట్ల రూపాయ‌లన్న‌మాట‌. ఇదో మెకానిక‌ల్ గ‌డియారం.

టెక్సాస్ సిటీ ప‌డ‌మ‌టి కొండ‌ల్లో 500 అడుగుల లోతులో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంత‌కీ.. దీన్ని ఎవ‌రు నిర్మిస్తున్నారో చెప్ప‌నే లేదు క‌దూ! ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నవంతుడిగా పేరు సంపాదించుకున్న జెఫ్ బోజెస్‌.

ఈ జెఫ్ బోజెస్ ఎవ‌రో ఈ పాటికి బుర్ర‌కు త‌ట్టే ఉంటుంది. అమేజాన్ సీఈఓ ఆయ‌న. గడియారం తయారు చేస్తున్న వీడియోను ఆయన ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. థర్మల్‌ సైకిల్స్‌తో ఈ గడియారాన్ని రూపొందిస్తున్నారట.

ఇది తాత్కాలిక‌మే. త్వ‌ర‌లోనే దీన్ని సౌర‌శ‌క్తితో న‌డిచేలా అనుసంధానిస్తారు. థింకింగ్‌ మెషీన్స్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు డ్యానీ హిల్లిస్‌తో క‌లిసి జెఫ్ బోజెస్ ఈ గడియారాన్ని రూపొందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here