ఎంత ధైర్యం..ఏకే-47తో కాల్పులు జ‌రిపించుకున్నాడు..చిరున‌వ్వుల‌తో నిల్చున్నాడు!

కీవ్‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి పేరు వ్యాఛెస్లావ్ న‌ల్య‌వైకో. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల‌ను త‌యారు చేసే సంస్థ‌కు అధిప‌తి. త‌న కంపెనీలో త‌యారు చేసిన ఓ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ధ‌రించి, 33 అడుగుల దూరంలో నుంచి కాల్పులు జ‌రిపించుకున్నాడు. అదీ ఏకే-47 రైఫిల్‌తో. షూట‌ర్ ఆయ‌న‌పై ఆరు రౌండ్ల మేర కాల్పులు జ‌రిపాడు. అత‌ను గురి త‌ప్ప‌లేదు.

ఆరుకు ఆరు బుల్లెట్లూ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లో దిగ‌బ‌డ్డాయి. ఏ ఒక్క‌టి కూడా అత‌ని శ‌రీరాన్ని తాక‌లేదు. రివ్వుమంటూ శ‌బ్దం చేసుకుంటూ వెళ్లిన బుల్లెట్లు జాకెట్‌లో దిగాయి. వాటిల్లో ఏ ఒక్క‌టైనా వ్యాఛెస్లావ్ శ‌రీరానికి త‌గిలి ఉంటే స్పాట్ డెడ్డే.

కాల్పులు పూర్తయిన త‌రువాత చిరున‌వ్వులు చిందిస్తూ తాను ధ‌రించిన జాకెట్‌లో నుంచి బుల్లెట్‌ప్రూఫ్‌ను బ‌య‌టికి తీశాడు. దేశ ర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల కోసం ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల‌ను వ్యాఛెస్లావ్ త‌యారు చేశార‌ట‌. ఏకే-47 నుంచి వెలువ‌డే శ‌క్తిమంత‌మైన బుల్లెట్ల‌ను కూడా త‌ట్టుకునే సామ‌ర్థ్యం దీనికి ఉంద‌ని ఆయ‌న అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here