శ్రీ‌దేవిది `అనుమానాస్ప‌ద మృతి`గా కేసు న‌మోదు చేశారా? పోలీసుల అదుపులో శ్రీ‌దేవి కారు డ్రైవ‌ర్‌!

ముంబై: శ్రీ‌దేవి మృతి కేసులో మ‌రో అనూహ్య మ‌లుపు చోటు చేసుకుంది. ఆమె మ‌ర‌ణాన్ని దుబాయ్ పోలీసులు అనుమానాస్ప‌ద మృతి (స‌స్పీసియ‌స్ డెత్‌)గా కేసు న‌మోదు చేసిన‌ట్టు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బుర్ దుబాయ్ పోలీస్‌స్టేష‌న్‌లో బోనీ క‌పూర్‌ను విచారించారు. ఆయ‌న ఇచ్చిన స్టేట్‌మెంట్ బుర్ దుబాయ్ పోలీసులు రికార్డు చేశారు.

కొద్దిసేప‌టి త‌రువాత శ్రీ‌దేవి కారు డ్రైవ‌ర్‌ను కూడా అదుపులోకి తీసుకుని, విచారిస్తున్న‌ట్లు దుబాయ్ మీడియా వెల్ల‌డించింది. బోనీక‌పూర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వివ‌రాలు ఇంకా పూర్తిస్థాయిలో వెల్ల‌డి కావాల్సి ఉంది.

బోనీక‌పూర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై పోలీసుల్లో అనుమానాలు త‌లెత్తాయ‌ని, అందుకే శ్రీ‌దేవి కారు డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని అంటున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆమె కారు డ్రైవ‌ర్‌కు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను కాగితంపై రాసి ఇచ్చార‌ని, వాటికి స‌మ‌గ్రంగా స‌మాధానాలను ఇవ్వాల‌ని ఆదేశించిన‌ట్లు చెబుతున్నారు. మ‌రోవంక‌- శ్రీ‌దేవి పార్థివ దేహానికి ఎంబాల్మింగ్ చేస్తున్నారు.

ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ విచార‌ణ పూర్త‌యిన త‌రువాతే ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ స‌భ్య‌ల‌కు అంద‌జేస్తారు. త‌మ‌కు ఉన్న అనుమానాల‌ను 100 శాతం నివృత్తి చేసుకున్న త‌రువాతే పార్థివ‌దేహాన్ని కుటుంబ స‌భ్య‌ల‌కు అంద‌జేస్తామ‌ని బుర్ దుబాయ్ పోలీసులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here