బుర్ఖా వేసుకున్నాడు.. చేతికి గ్లౌజులు.. కాళ్ళకు హవాయ్ చెప్పులుండడంతో..!

బెంగళూరు నగరంలో బుర్ఖా వేసుకున్న ఓ వ్యక్తిని ప్రజలు పట్టుకున్నారు. బుర్ఖా కొనుక్కొని.. చేతికి గ్లౌజులు ధరించి.. ఎర్రటి బ్యాగుతో తిరుగుతూ ఉన్నాడు. అయితే అనుమానం రావడానికి ముఖ్య కారణం మాత్రం అతడు వేసుకున్న చెప్పులే.. కాళ్ళకు హవాయ్ చెప్పులు ధరించి ఉండడం.. మగవాళ్ళ కాళ్ళు అని స్పష్టంగా తెలిసిపోవడంతో అతన్ని చుట్టుముట్టారు. మొఖం చూడగా మగవాడని అర్థం అయిపోయింది. ఈ ఘటన బెంగళూరు లోని హెచ్.బి.ఆర్. లే అవుట్ లో చోటుచేసుకుంది. నమాజ్ కోసం వెళుతున్న ముస్లిం సోదరులకు ఇతడి మీద అనుమానం రావడంతో అడ్డంగా దొరికిపోయాడు.

కొందరు యువకులు కలిసి అతన్ని కేజీ హళ్ళి పోలీసులకు పట్టించారు. తన పేరు శివరాజ్ అని నగరం లోని శివాజీనగర్ లో బుర్ఖా కొన్నానని మొదట చెప్పాడు. మొదట ఎవరినీ చంపడానికి రాలేదని చెప్పిన అతడు ఆ తర్వాత టెక్కీగా పనిచేస్తున్న జగన్నాథ్ అనే వ్యక్తిని చంపాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తనతో పాటూ వచ్చిన మరికొందరు ఎస్కేప్ అయ్యారని పోలీసులతో చెప్పాడు శివరాజ్. ఆ జగన్నాథ్ ను కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here